Sunday, April 28, 2024

TS | సూర్యాపేట మహావీర్ ఫుడ్‌కోర్ట్ దాతృత్వం.. రాత్రివేళ అన్నార్థుల‌కు అన్న‌దానం

సూర్యాపేటలోని మహావీర్ ఫుడ్ కోర్ట్‌ వారు రాత్రి వేళల్లో అన్నదానం చేస్తున్నారు. తన ఫుడ్ కోర్ట్ 10 గంటల వరకు మాత్రమే నడుస్తుందని, నిర్వాహకుల్లో ఒకరైన‌ రాము చెప్పారు. 10 గంటల తర్వాత మిగిలిపోయిన అన్ని వంటకాలను ఇలా అన్నార్తులకు, భిక్ష‌గాళ్లకు అందిస్తుంటామని తెలియజేశారు. మిగిలిపోయిన వంటకాల్లో నిన్న‌టివి ఉండ‌వ‌న్నారు. మ‌హ‌వీర్ ఫుడ్‌కోర్ట్ వారి దాతృత్వాన్ని, వారి మంచి ప‌నిని ప‌లువురు హ‌ర్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement