Tuesday, May 7, 2024

Delhi | లీడ‌ర్లు కూడా సాధారణ పౌరులే.. ద‌ర్యాప్తు సంస్థ‌లపై పిటిషన్​ విషయంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాజకీయ నాయకులు కూడా దేశంలోని సాధారణ పౌరుల వంటి వారేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సీబీఐ, ఈడీ సహా దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ రాజకీయ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్, డీఎంకే, బీఆర్‌ఎస్, టీఎంసీ, ఆప్, ఎన్సీపీ, శివసేన సహా 14 పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు నిరాకరించింది.

ప్రతిపక్ష నాయకులు, పౌరులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కఠినమైన నేర ప్రక్రియలకు పాల్పడుతోందని,కేంద్ర ప్రభుత్ తో విభేదించే, అసమ్మతిని తెలిపే వారి ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని రాజకీయ పార్టీలు పిటిషన్‌లో ఆరోపించాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం ముందు బుధవారం పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు

రాజకీయ నాయకులైనంత మాత్రాన సాధారణ పౌరులకు మించి ఏమీ ఉండవని వ్యాఖ్యానించింది. సాధారణ పౌరులకు ఏ నియమాలు, పద్ధతులు వర్తిస్తాయో రాజకీయ నాయకులు కూడా అవే వర్తిస్తాయని అభిప్రాయపడింది. రాజకీయ నాయకుల కోసం ప్రత్యేకంగా తాము మార్గదర్శకాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. రాజకీయ నాయకులు అయినంత మాత్రాన అత్యున్నత గుర్తింపు కోరడానికి అవకాశం లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. రాజకీయ నాయకుల కోసం విభిన్నమైన పద్ధతులు ఎలా ఉంటాయని ప్రశ్నించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement