Sunday, May 19, 2024

HYD: నయ్యా సాగ్గిని ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా నియమించిన వెల్‌స్పన్‌ లివింగ్‌ లిమిటెడ్‌

హైదరాబాద్‌: హోమ్‌ టెక్స్‌టైల్స్‌, ఫ్లోరింగ్‌ సొల్యూషన్స్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్స్‌టైల్స్‌లో అగ్రగామిగా ఉన్న వెల్‌స్పన్‌ లివింగ్‌ లిమిటెడ్‌, తమ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నయ్యా సాగ్గిని నియమించినట్లు వెల్లడించింది. 2024 ఏప్రిల్‌ 25 నుండి ఈ నియామకం అమల్లోకి రానుంది. ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా తొలుత నాలుగు సంవత్సరాల పాటు సాగ్గి కొనసాగుతారు. ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా ఆమె పదవీకాలం 2028 ఏప్రిల్‌ 24తో ముగుస్తుంది.

ఈసందర్భంగా నయ్యా సాగ్గి నియామకంపై వెల్‌స్పన్‌ లివింగ్‌ సీఈఓ అండ్ ఎండి దీపాలి గోయెంకా మాట్లాడుతూ… నయ్యా చేరిక వెల్‌స్పన్‌ లివింగ్‌కు ఒక వ్యూహాత్మక మైలురాయిని సూచిస్తుందన్నారు. వినియోగదారుల కేంద్రీకృత పరిశ్రమలలో సాగిన ఆమె వ్యవస్థాపక ప్రయాణంలో ఆమె నైపుణ్యం, కొత్తదనాన్ని తెస్తుందన్నారు. నయ్యా వ్యూహాత్మక పరిజ్ఞానం, ముఖ్యంగా ఆమె బీ2సీ అండ్ ఇ కామర్స్‌ అనుభవం వెల్‌స్పన్‌ లివింగ్‌ బీ2సీ వృద్ధి పథాన్ని ముందుకు తీసుకువెళ్లనుందన్నారు. నయ్యా సాగ్గి తన నియామకంపై మాట్లాడుతూ… వెల్‌స్పన్‌ లివింగ్‌ లిమిటెడ్‌లో ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా చేరడం ఒక గౌరవంగా భావిస్తున్నానన్నారు.

శ్రేష్ఠత అండ్‌ ఆవిష్కరణల పట్ల వెల్‌స్పన్‌ నిబద్ధత ప్రశంసనీయమన్నారు. దాని నిరంతర విజయానికి దోహదపడాలని తాను ఎదురు చూస్తున్నానన్నారు. వినియోగదారు-కేంద్రీకృత పరిశ్రమల్లో తన అనుభవం, బ్రాండ్‌ బిల్డింగ్‌లో బలమైన డిజిటల్‌ డీఎన్‌ఏ తీసుకురావడం, లాభం, ఉద్దేశ్యంతో స్థిరమైన, సమగ్ర వృద్ధి పట్ల తన అభిరుచి, వెల్‌స్పన్‌ విలువలతో సంపూర్ణంగా సరిపోలతాయని తాను నమ్ముతున్నానన్నారు. వ్యూహాత్మక కార్యక్రమాలను నడపడానికి, వాటాదారుల కోసం విలువను సృష్టించడానికి బోర్డు, మేనేజ్మెంట్ టీంతో కలిసి పనిచేయటానికి ఎదురుచూస్తున్నానన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement