Sunday, May 19, 2024

TS | గంట నుంచి దంచుతున్న వాన.. హైదరాబాద్ ఆగం

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఆఫీస్‌లనుంచి ఇంటికెళ్లే సమయంలో వర్షం ప్రారంభంకావ‌డంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మీద వర్షపు నీరు వరదలా పారుతోంది.. హైదరాబాద్ రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.

ఈదురుగాలుల‌తో భారీ వ‌ర్షం…

కూకట్‌పల్లి, కేపీహెచ్‌ఐబీ, మూసాపేట పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలుల‌తో భారీ వర్షం కురుస్తోంది. బాలానగర్, ఫతేనగర్, సనత్‌నగర్‌లో వర్షం కురుస్తోంది. జీడిమెట్ల, చింతల్, షాపూర్, కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్‌లో ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తోంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా చెట్లు, హోర్డింగ్స్‌ నేలకూలుతున్నాయి. కోఠి, అబిడ్స్, గోషామహల్, ఎంజే మార్కెట్‌ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement