Saturday, May 11, 2024

IPL : ఇవాళ డ‌బుల్ ధ‌మాకా

ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. ఈ రెండు మ్యాచ్లు కూడా పెద్ద ఫైట్స్ కావడం విశేషం. ముందుగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక. మరొక మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నై వేదికగా రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

- Advertisement -

ఆర్సీబికి అగ్ని ప‌రీక్షే…

అహ్మాదాబాద్ లోని మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకి గుజరాత్ టైటాన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం గుజరాత్ పాయింట్ల పట్టికలో 9 మ్యాచ్ లు ఆడి నాలుగింట్లో గెలిచి 7వ స్థానంలో కొనసాగుతుండగా.. ఇక, ఆర్సీబీ 9 మ్యాచ్ లు ఆడి కేవలం రెండిట్లో గెలిచి చివరి ప్లేస్ కొనసాగుతుంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 3 మ్యాచ్ లు జరిగాయి. గుజరాత్ 2 సార్లు విజయం సాధించగా ఆర్సీబీ ఒకసారి గెలిచింది.

అయితే, ఆర్సీబీ ఆఖరి ప్లేస్ నుంచి ప్లే ఆఫ్ కి వెళ్లడం దాదాపు కష్టం అనే చెప్పుకోవాలి. కాకపోతే మిగిలిన జట్లు గెలుపు ఓటముల మీద ఆధారపడి ఉంది. విరాట్ కొహ్లీ తనదైన ఫాంతో అద్భుతమైన బ్యాటింగ్ తో దూసుకుపోతున్నాడు. ఈ సీజన్ లో తనే టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఇక, గత మ్యాచ్ లో హైదరాబాద్ మీద విజయం సాధించిన ఆర్సీబీ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. గుజరాత్ మరో విజయం నమోదు చేయాలనే పట్టుదలతో ముందుకు వెళ్తుంది. అలాగే, బౌలింగ్ లో కూడా మహ్మద్ సిరాజ్ ఫామ్ లోకి రావడం ఆర్సీబీకి ఒక శుభ పరిణామమని చెప్పాలి.

ఇక, గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే కెప్టెన్ శుభ్ మన్ గిల్ బ్యాటింగ్ లో తడబడుతున్నాడు. ఒక మ్యాచ్ లో ఆడితే, మూడు మ్యాచ్ ల్లో తొందరగా ఔట్ అయిపోతున్నాడు. మిగిలినవాళ్లు ఆడితే జట్టు గెలుస్తుంది. లేకపోతే ఓటమిని చవిచూస్తుంది. కాకపోతే బ్యాటింగ్, బౌలింగ్ అన్నింటా యావరేజ్ గానే జీటీ టీమ్ ఉంది. సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ బాగా ఆడుతున్నారు. కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, దర్శన్ లాంటి ప్లేయర్స్ బ్యాటింగ్ లో టచ్ లోకి వస్తే ఆర్సీబీపై విజయం ఈజీ అవుతుంది.

స‌న్ ను సిఎస్కే నిలువ‌రిస్తుందా…

నేడు ఐపీఎల్ 2024లో కీలక మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీ పడుతుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇక, ప్లేఆఫ్ రేసులో కొనసాగాలంటే చెన్నై టీమ్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాల్సిన పరిస్థితి ఏర్ప‌ డింది. రెండు మ్యాచ్‌ల్లోనూ సీఎస్‌కే లక్నో సూపర్‌జెయింట్స్ చేతిలో ఓడిపోయింది.
మరోవైపు గత మ్యాచులో ఆర్సీబీ చేతిలో ఓడిన హైదరాబాద్ టీమ్ ఈ మ్యాచ్ లో గెలవాలని చూస్తుంది. ఈ టోర్నమెంట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో ఆడిన 8 మ్యాచ్‌లలో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది.

చెన్నై సూపర్ కింగ్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ ఇప్పటి వరకు 20 మ్యాచ్‌లు ఆడగా అందులో సీఎస్‌కే 14 మ్యాచ్‌లు, హైదరాబాద్ 6 మ్యాచ్‌లు విజయం సాధించాయి. హైదరాబాద్ పై చెన్నై అత్యధిక స్కోరు 223గా ఉంది. కాగా సీఎస్కేపై సన్‌రైజర్స్ అత్యధికంగా 192 పరుగులు చేసింది. ఇక, చివరిసారిగా ఈ రెండు జట్లు ఏప్రిల్ 5వ తేదీన 2024న తలపడ్డాయి. ఇక, ఈ మ్యాచులో సోషల్ మీడియాలో కొనసాగుతున్న అంచనాలను చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిచేందుకు 53 శాతం ఛాన్స్ ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కేవలం 47 శాతం అవకాశం ఉందన్నారు.

తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ ( కెప్టెన్ ), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని , దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతిషా పతిరానా, ముస్తాఫిజుర్ రెహమాన్. ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ , ఐడెన్ మార్క్రామ్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ ( కెప్టెన్ ), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కెండే, జయదేవ్ ఉనద్కత్. ఇంపాక్ట్ ప్లేయర్ టీ నటరాజన్

Advertisement

తాజా వార్తలు

Advertisement