Wednesday, December 4, 2024

TS : రూ. 2కోట్ల విలువ చేసే మ‌ద్యం ప‌ట్టివేత‌

లోక్ స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స‌రిహ‌ద్దుల్లో ముమ్మ‌రంగా త‌నిఖీలు చేప‌డుతున్నారు. మద్యం, డబ్బు ప్రవాహాన్ని అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం, అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. తాజాగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో రూ. 2కోట్ల విలువ చేసే మ‌ద్యాన్ని పోలీసులు ప‌ట్టుకున్నారు.

- Advertisement -

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బాలానగర్‌ వద్ద భారీగా మద్యం పట్టుబడింది. జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఓ లారీ అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో దానిని సీజ్‌చేశారు. దాని విలువ రూ.2 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement