Sunday, May 29, 2022

కేంద్ర ప్ర‌భుత్వంపై నిర‌స‌న‌లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మేయ‌ర్

బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణ రైతుల పట్ల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ల‌తో కలిసి గండి మైసమ్మ తెలంగాణ భవన్ వద్ద నుండి పాదయాత్ర గా గండి మైసమ్మ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి నిరసన కార్యక్రమంలో మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి , సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంసీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ చైర్మన్లు, కౌన్సిలర్లు, తెరాస పార్టీ అనుబంధ కమిటీల సభ్యులు, నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement