Monday, May 13, 2024

ఆర్.ఆర్ డయాగ్నస్టిక్స్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్.ఆర్ డయాగ్నస్టిక్స్ సెంటర్ ను భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ఈరోజు ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ… వైద్యం, ఆరోగ్య పరంగా భూపాలపల్లిలో అత్యాధునిక పరికరాలతో ఆసుపత్రులు ఏర్పాటు కావడం అభినందనీయమని ఆయన అన్నారు. వరంగల్ హన్మకొండ పట్టణంలోని వైద్యశాలకు పోటీపడుతూ వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. నూతన అత్యాధునిక వైద్య పరికరాలు భూపాలపల్లి వైద్యశాలలో ఉండడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. జిల్లాలోని ప్రజలు సుదీర్ఘ ప్రాంతాలకు పోకుండా జిల్లా కేంద్రంలో ఉన్న ఆసుపత్రుల్లో వైద్యసేవలు ఉండాలన్నారు.

ఆస్పత్రుల నిర్వాహకులు ప్రజల స్థితిగతులను బట్టి ఫీజులను వసూలు చేయాలన్నారు. మానవతా దృక్పథంతో సేవ చేయాలని లక్ష్యంగా ఉండాలన్నారు. ఆస్పత్రి డాక్టర్ సూరం అనిల్ కుమార్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రాంతంలోనే అత్యాధునిక పరికరాలతో డయాగ్నస్టిక్స్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆల్ట్రా సౌండ్ స్కానింగ్, డిజిటల్ ఎక్స్ రే పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ ప‌ర్సన్ వెంకట రాణి, వైస్ చైర్మన్ హరిబాబు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ జనార్ధన్ కటకం, సొసైటీ అధ్యక్షులు మేకల సంపత్, హనుమాన్ ఆలయ చైర్మన్, కౌన్సిలర్లు, జిల్లా నాయకులు, జాగృతి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement