Wednesday, May 1, 2024

జిల్లా ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ శివలింగయ్య..

జనగామ , ప్రభన్యూస్ జిల్లా ఆస్పత్రిని కలెక్టర్ శివలింగయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. .ఈ తనిఖీలో రక్త నమూనా పరీక్షా కేంద్ర పనితీరు, రక్త నిధి కేంద్రాన్ని పరిశీలించారు. రక్త నిధి కేంద్రంలో తెల్ల రక్త కణాలు స్టోరేజ్ మిషన్లను వాడుకలోకి తీసుకోకపోవడంతో సంబంధిత ఇంచార్జి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి లో రీ హెల్త్ కేర్ వంటగది ఆస్పత్రి పరిసరాలను, సంబంధిత డ్యూటీ డాక్టర్ల రోజువారి హాజర్ రిజిస్టర్ లు పరిశీలించారు. అనంతరం డ్యూటీ డాక్టర్లతో కలెక్టర్ సమీక్షించారు .ఇందులో విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా చూడాలని, అదేవిధంగా ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ విధానాన్ని అంతేకాకుండా ఆసుపత్రిలో సీసీ కెమెరాల పర్యవేక్షణ మానిటరింగ్ ఏర్పాటు చేయాలని జిల్లా ఆస్పత్రి వైద్య అధికారులకు సూచించారు ఆయుర్వేదిక ఔషధ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు .అంతేకాకుండా ఆస్పత్రి ఎదుట పార్కింగ్ క్రమపద్ధతిలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆస్పత్రిలో పరిశుభ్రత పాటించాలని పేర్కొన్నారు. వీరితో పాటు డిప్యూటీ కలెక్టర్ అబ్దుల్ హమీద్ డి ఆర్ డి ఓ పి డి రామ్ రెడ్డి జిల్లా వైద్య అధికారి. మహేందర్ జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సుగుణాకర్ రాజు డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement