Wednesday, May 25, 2022

ఆశ కార్యకర్తలకు మంత్రులు, హరీశ్, ఎర్రబెల్లి సత్కారం..

మరిపెడ (ప్రభ న్యూస్): మహబూబాబాద్ జిల్లా మెడికల్ కళాశాల నిర్మాణ శంకుస్థాపనకు వచ్చిన మంత్రి తన్నీరు హరీష్ రావు తిరుగు ప్రయాణంలో మరిపెడ మండలంలోని పురుషోత్తమాయ గూడెంలో టీఆర్ ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి నిర్మించిన అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావుకు ఆశ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, టీఆర్ ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

అనంతరం జీతాలు పెంచిన మంత్రికి ఆశ సిబ్బంది శాలువాల‌తో సత్కారం చేస్తుండగా.. ‘‘నాకు వద్దు అమ్మా.. నిరంతర శ్రామికులు మీరు”అంటూ వారికే మంత్రి సన్మానం చేశారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఆశ సిబ్బందికి శాలువాలతో సత్కారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, పలువురు సర్పంచులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement