Saturday, April 27, 2024

అఖిల భారత హిందూ మహాసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్తా

కోల్ కతాలోని రూబీ క్రాసింగ్ వద్ద అఖిల భారత హిందూ మహాసభ ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద మహిషాసుని స్థానంలో మహాత్ముడిని పోలిన బొమ్మను ఏర్పాటు చేయడాన్ని ఇంటర్నేషనల్ వైశ్య సంఘం తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్, IVF రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. మంగళవారం నాగోల్ చౌరస్తా లో మహాత్మా గాంధీ విగ్రహానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. 108 కొబ్బరికాయలు కొట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం గాంధీని చంపిన గాడ్సేని ప్రోత్సహిస్తూ, భారత జాతిపిత మహాత్మా గాంధీని అవమానపరుస్తున్నారని ఆయన అన్నారు. అహింసా మార్గంతోనే గాంధీ న‌డిచార‌న్న విష‌యం గుర్తుంచుకోవాల‌న్నారు. కార్యక్రమంలో IVF పొలిటికల్ కమిటీ ఛైర్మన్ బచ్చు శ్రీనివాస్ గుప్తా, కో- ఆర్డినేటర్ నాగరాజు గుప్తా, IVF తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆలేటి రవి, IVF మహిళా విభాగ్ ఉప్పల స్వప్న, భువన, ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement