Wednesday, May 8, 2024

రేపటి నుంచే రిలయన్స్‌ జియో 5 జీ సేవలు.. అందరికీ కాదండోయ్​!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5 జీ సేవలు అందుబాటులోకి రానే వచ్చాయి. అయితే, తొలిసారిగా దసరా పండుగను పురస్కరించుకొని దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో 5 జీ సేవలు ప్రయోగాత్మకంగా అందించేందుకు రిలయన్స్‌ జియో సిద్ధమైంది. అయితే, ఈ 5 జీ సేవలను కూడా లిమిటెడ్‌ యూజర్లకు మాత్రమే అందిస్తుండటం విశేషం. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసి నగరాల్లోని జియో వినియోగదారులు బుధవారం నుంచి 5జీ సేవలను యాక్సెస్ చేయనున్నట్లు రిలయన్స్‌ జియో సంస్థ తెలిపింది. జియో ప్రతి ఒక్క వినియోగదారుడికి ఈ 5 జీ సేవలు అందుబాటులోకి రావని పేర్కొంది.

ఎంపిక చేసిన వినియోగదారులకు ‘జియో వెల్‌కం ఆఫర్‌’ అంటూ ఇన్విటేషన్‌ పంపించారు. ఈ 5 జీ సేవల బీటా పరీక్ష మాత్రమే కానీ వాణిజ్య ప్రయోగం కాదు. అందుకని రాండమ్‌గా ఎంపికైన వినియోగదారులకు మాత్రమే 5 జీ సేవలు అందుతాయి. ర్యాండ్‌మెగా ఎంపికైన వినియోగదారులు ప్రస్తుతం వాడుతున్న హ్యాండ్‌సెట్‌, సిమ్‌ను మార్చాల్సిన అవసరం లేదని సంస్థ తెలిపింది. ప్రయోగాత్మకంగా అందిస్తున్న తొలి దశలో 1 జీబీపీఎస్‌ వేగంతో అన్‌లిమిటెడ్‌ 5 జీ డాటాను కస్టమర్లు పొందుతారని రిలయన్స్‌ జియో ధ్రువీకరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement