Saturday, December 9, 2023

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒక‌రు మృతి.. ముగ్గురికి గాయాలు..

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఇస్నాపూర్‎లో అతివేగంగా వ‌చ్చిన కారు ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు. అనంత‌రం గాయ‌ప‌డిన‌వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేర‌కు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement