Thursday, April 25, 2024

పాకిస్థాన్ లో మృతి చెందిన.. ఖ‌లిస్థాన్ ఉగ్ర‌వాది హ‌ర్వింద‌ర్ సింగ్ రిందా

పాకిస్థాన్ లో మృతి చెందాడు ప‌లు ఉగ్ర‌వాద కేసుల‌తో సంబంధం ఉన్న ఖ‌లిస్థాన్ ఉగ్ర‌వాది హ‌ర్వింద‌ర్ సింగ్ రిందా. ఈ మేర‌కు పంజాబ్ పోలీసులు ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించాయి.హర్విందర్‌ను తాము కాల్చి చంపామని గ్యాంగ్‌స్టర్ గ్రూప్ దావిందర్ భాంబిహా ప్రకటించుకుంది. ఈ ఏడాది మేలో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై జరిగిన రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్‌పీజీ) దాడిలో హర్విందర్ ప్రధాన సూత్రధారి. లుధియానా కోర్టులో పేలుడులోనూ ఆయన హస్తం ఉంది.

పంజాబ్‌కు చెందిన పాప్యులర్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ హర్విందర్ పేరు చక్కర్లు కొట్టింది. పలు ఉగ్రవాద కేసులతో సంబంధం ఉన్న హర్విందర్.. నిషేధిత ఖలిస్థానీ గ్రూప్ బబ్బార్ ఖల్సా ఇంటర్నేషనల్ సభ్యుడు. హర్విందర్‌ను కాల్చి చంపామని గ్యాంగ్‌స్టర్ గ్రూప్ ప్రకటించినప్పటికీ పంజాబ్ పోలీసు వర్గాలు మాత్రం మరోలా చెబుతున్నాయి. కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న హర్విందర్ 15 రోజుల క్రితం లాహోర్ ఆసుపత్రిలో చేరాడని, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని చెబుతున్నారు. కాగా, రిందా తలపై జాతీయ దర్యాప్తు సంస్థ రూ. 10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement