Tuesday, May 14, 2024

ప్రసన్నాంజనేయ స్వామి అనుగ్రహం మనంద‌రిపై ఉండాలి : మంత్రి హ‌రీశ్ రావు

ప్ర‌స‌న్నాంజ‌నేయ స్వామి అనుగ్ర‌హం మ‌నంద‌రిపై ఉండాల‌ని రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని స్థానిక గణేష్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ మాలధారణ స్వాములకి బిక్షా కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మనంద‌రిపై ఉండాలని హనుమాన్ దీక్ష అత్యంత పవిత్రంగా, అకుంఠిత దీక్షతో ఎంతో నియమ నిష్టలతో స్వీకరిస్తారన్నారు. అకుంఠిత దీక్ష ఫలించాలని, వారి సంకల్పం సిద్దించాలని స్వామిని ప్రార్థించారు. శ్రీరామ భవనంలో హనుమాన్ దీక్షా స్వాములకు ఏర్పాటు చేసిన బిక్షా కార్యక్రమం అభినందనీయమ‌ని అన్నారు. అంతకు ముందు అలయ అర్చకులు మంత్రి హరీష్ రావు కు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అక్షయ తృతీయ సందర్భంగా గో పూజ నిర్వహించారు. బిక్షా కార్యక్రమం ప్రారంభించి స్వాములతో కలిసి మంత్రి బిక్షా చేశారు. అలాగే నర్సపూర్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ దేవాలయ కల్యాణోత్సవం సందర్భంగా మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అమ్మవారు దీవెనతో ఈ ప్రాంతమంతా కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలమైంద‌ని, రైతులు మొహం మొగులుకు పెట్టి చూసే రోజులు పోయాయని అన్నారు. కరువు పీడిత ప్రాంతం నుండి కల్పతరువుగా మారిందన్నారు. ఆ అమ్మవారి దయతో అన్నింటా మీకు మీ కుటుంబాలకు శుభం చేకూరాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement