Tuesday, July 23, 2024

Palak Tiwari : డోస్ పెంచుతున్న పాల‌క్ తివారీ

పాలక్ తివారీ.. బాలీవుడ్ టీవీ సీరియల్ సీనియర్ నటి శ్వేతా తివారీ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇప్పటి వరకు రెండే రెండు సినిమాల్లో యాక్ట్ చేసినా.. ప్రత్యేక గుర్తింపు మాత్రం సంపాదించుకుంది. సినిమాల రిజల్ట్ పక్కన పెడితే.. యాక్టింగ్ తో మంచి ప్రశంసలు అందుకుంది ఈ అమ్మడు.

- Advertisement -

చెప్పాలంటే.. అందం, అభినయంతో తల్లికి మించి సినీ ఇండస్ట్రీలో అలరిస్తోంది పాలక్ తివారీ. మూడేళ్ల క్రితం హార్డీ సంధు మ్యూజిక్ వీడియో ‘బిజిలీ బిజిలీ’తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది పాలక్ తివారీ. 2022లో మాంగ్తా హై క్యా అనే మరో మ్యూజిక్ వీడియోలో నటించింది. గత ఏడాది కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కిసీ కా భాయ్ కిసీకి జాన్‌ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై తొలిసారి మెరిసింది. ఆ మూవీలో వెంకటేష్‌, జగపతిబాబు, పూజా హెగ్డే, షెహ్‌నాజ్‌ గిల్‌ లతో పాటు కీలక పాత్ర పోషించింది పాలక్.

అయితే కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఆడకపోయినా.. ఈ అమ్మడి నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత సంజయ్ దత్ తో కలిసి సెకండ్ మూవీ చేసింది. హారర్ కామెడీ ఫిల్మ్ ‘ది వర్జిన్ ట్రీ’లో నటించింది. ఇటీవల యూఎస్ పోలో అసోసియేషన్ కు భారతీయ మహిళల దుస్తుల బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైంది. తొలి లేడీ అంబాసిడర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

ప్రస్తుతం అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న పాలక్ తివారీ.. అప్పుడప్పుడు ప్రైవేట్ పార్టీస్ లో మెరుస్తుంటోంది. టైట్ ఫిట్ డ్రెస్సులు వేసుకుని అందరి దృష్టి తనవైపు తిప్పుకుంటుంది. ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంటోంది. మరోవైపు, సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంటోంది. సెగలు పుట్టించే పోజులను తన ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటోంది. ఆఫర్స్ కోసం వేరే లెవెల్ లో అందాలు వడిస్తోంది.

తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసింది పాలక్ తివారీ. క్రేజీ స్కర్ట్ లో హోయలు ఒలికిస్తోంది. ఎద అందాలతో కవ్విస్తోంది. నెట్టింట కుర్రాళ్ల మతులు పోగుడుతోంది. స్కిన్ షోతో ఫిదా చేస్తోంది. నవ్వుతోనే అందరినీ మాయ చేస్తోంది. అయితే పాలక్ కొత్త పిక్స్ చూసిన నెటిజన్లు.. గ్లామర్ డోస్ రోజురోజుకు పెరిగిపోతుందని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement