Monday, April 29, 2024

కృష్ణ వ్రింద విహారి నుండి సాంగ్ రిలీజ్ – ఎప్పుడంటే


సినిమా జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమాల‌లో న‌టిస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నాగ‌శౌర్య‌.
ఆయ‌న న‌టిస్తోన్న తాజా చిత్రం కృష్ణ వ్రింద విహారి . అనీష్ ఆర్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. షిర్లే సేథియా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతాన్ని అందించాడు. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటుంది. ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం మే 20న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలోని ఏముందిరా అనే పాట‌ను బుధ‌వారం విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు పోస్ట‌ర్ ద్వారా సోష‌ల్ మీడియాలో తెలిపారు.కాగా ఈ పోస్ట‌ర్‌లో నాగ‌శౌర్య హీరోయిన్ షిర్లేను ఎత్తుకుని ఉన్నారు. ఈ పాట మాస్ బీట్‌లా ఉండ‌నున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement