Tuesday, May 14, 2024

వార్డుల అభివృద్ది కోసం కృషి..


దేవరకద్ర : మండల కేంద్రంలో వార్డుల అభివృద్ది కోసం వార్డు సభ్యులు ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని స్థానిక సర్పంచ్‌ కొండ విజయలక్ష్మి కోరారు. గ్రామ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఒకటో వార్డు , రెండో వార్డు పరిశీలించారు. వాటిలో మొదటిది సమస్యగానే డ్రైనేజ్‌ సమస్యగానే , వీధిలైట్ల సమస్యగానే ఏమైనా ఉంటే వెంటనే ఆ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకుని వస్తే పరిష్కారం చేస్తామని ఆమె చెప్పారు. వార్డుల అభివృద్దిలో సభ్యులపాత్ర ఎంతో కీలకమని అందుకు అభివృద్దికి పూర్తి సహకారం అందించాలని ఆమె కోరారు. డ్రైనేజ్‌ కాలువలు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడం జరుగుతున్నాయని ఆమె తెలిపారు. గ్రామ సందర్శన కార్యక్రమంలో ఈఓ వనిత , వార్డు సభ్యురాలు శారద , వీరారెడ్డి , సిబ్బంది , రాము , రాజు , చిరంజీవి , తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement