Saturday, April 27, 2024

గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనే లక్ష్యం : మంత్రి నిరంజన్‌ రెడ్డి

గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని మంత్రి నిరంజన్‌ రెడ్డి చెప్పారు. పల్లెనిద్రలో భాగంగా వనపర్తి జిల్లా నాగసానిపల్లిలో గురువారం ఉదయం ఇంటింటికీ వెళ్లి గ్రామస్తులను కలిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సాగునీటి రాకతో గ్రామాల నుంచి వలసలు తగ్గాయన్నారు. మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలు బాగయ్యాయని, పల్లె ప్రగతితో గ్రామాలు పరిశుభ్రమయ్యాయని చెప్పారు. పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం నిర్మాణంతో పల్లెలకు కొత్త శోభ వచ్చిందని వెల్లడించారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, నీళ్ల ట్యాంక్ కేటాయింపుతో చెత్త సేకరణ, చెట్ల పెంపకానికి ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపు ఫలితంగానే ఇవన్నీ సాధ్యమయ్యాయని తెలిపారు. దేశంలోని మరే రాష్ట్రంలో ఇలాంటి పథకాలు అమలుకావడం లేదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement