Tuesday, April 16, 2024

సాయి ఆజ్ఞ అనుల్లంఘనీయం!

శిరిడీలో వున్న ఒక ప్రత్యేక నియమ ము ఏమిటంటే బాబా అనుమతి లేకుండా ఎవ్వరూ శిరిడీ విడువకూడ దు. అంతేకాక బాబా అనుమతి తీసుకున్న తరు వాత ఇక ఒక్క క్షణమైనా అక్కడ వుండకూడ దు. అందరూ బాబా ఆదేశానుసారము నడిచి తీరాలి. లేనిచో ఎన్నో విధాలుగా ఊహంచని కష్టాల పాలయ్యేవారు. ఈ నియమం వెనుక ఒక గొప్ప అంతరార్ధం వుంది. అదేమిటంటే శ్రీ సాయి సర్వాంతర్యామి. ప్రాణ వాయువు వలె ఈ సృష్టి అంతటా నిండివున్న పరబ్రహ్మ స్వరూపం. శిరిడీలోని పాడుబడిన మశీదులో కూర్చున్నప్పటికీ ఆ ప్రపంచం మొత్తం మీద జరిగే అన్ని విషయములు ఆయనకు తెలుస్తుం టాయి. భక్తులకు భూత, భవిష్యత్‌, వర్తమాన కాలంలో జరిగే అన్ని విషయములు ఆయనకు తేటతెల్లము. తన వద్దకు వచ్చే భక్తులకు ఎప్పు డు ఏం జరుగబోతున్నదీ ఆయనకు తెలుసు కాబట్టి, వారికి అపాయములు తప్పించుటకు తగిన సమయములో ఆదేశాలను ఇచ్చుచుం డెడివారు. ఆయన ఆదేశాలను తుచ తప్పక పాటించువారి బాధ్యతలన్నింటినీ తాను స్వీక రించేవారు కాబట్టి వారికి ఇక ఏవిధములైన అపాయములు కలిగెడివి కావు. ఆయన ఆజ్ఞల ను ధిక్కరించిన వారు అనేక విధ ములైన ఆప దలకు గురవుతుండేవారు. అట్టి రెండు సంఘ టనలను ఈ క్రింద స్మరించుకుందాము.
బాబా కూర్మి భక్తుడైన తాత్యాకోటే పాటిల్‌ ఒక రోజున కోపర్గావ్‌లో జరిగే సంతకు బయ లుదేరాడు. మశీదుకు పరుగులాంటి నడకతో వచ్చి బాబాకు నమస్కరించి నేను ఇప్పుడు కోపర్గావ్‌ సంతకు పోతున్నానని చెప్పాడు. బాబా అతనితో ”తొందర పడవద్దు. కొంచెం సేపు. ఆగు. ఇల్లు విడిచి ఎక్కడికీ వెళ్ళవద్దు” అని హతవు పలికారు. ఆతనికి జరుగబోవు ప్రమాదం గ్రహంచి బాబా ఈవిధముగా చె ప్పారు. కాని తాత్యా సంతకు పోయి తమాషా చూద్దామన్న ఆతృతలో బాబా మాటలను పెడచెవిన పెట్టి హుటహుటిన టాంగా ఎక్కి సంతకు బయలుదేరాడు. టాంగాకు కట్టిన ఒ క గుర్రం కొత్తగా కొన్నది, చాలా చురుకైనది. శిరిడీ విడిచి సావుల్‌ విహర్‌ దాటిన వెంటనే వేగంగా పరిగెత్తడం ప్రారంభించింది. కొంత దూరం పోయిన పిమ్మట కాలు మడతపడి కూలిపోయింది. అదృష్టవశాత్తు తాత్యాకు పెద్దగా దెబ్బలు తగులకుండా బయటపడ్డా డు. ఈ భయంకరమైన ప్రమాదం నుండి బాబా తనను ఏవిధంగా రక్షించారో గుర్తించి తాత్యా బాబాకు అనేక విధములుగా కృతజ్ఞత లు అర్పించుకున్నాడు.
మరొకసారి ఐరోపా దేశస్తుడొకడు బాబా దర్శనార్ధం శిరిడీకి వచ్చాడు. ఆతని కొరకు ప్రత్యేకంగా బస కోసం ఒక గుడారం వేసి అన్ని సౌకర్యాలను కల్పించారు. ఆ ఐరోపా దేశస్తుడు స్వతహాగా నాస్తికుడు. స్వాములను, బాబాల ను నమ్మడు. కాని సాయి మహమ విని ఆయన మహమలను పరీక్షించుదామని శిరిడీకి వచ్చా డు. అతను బాబా ముందు మోకరిల్లి వారి చేతి ని ముద్దాడాలని అనుకున్నాడు. కాని ఎందువ లనో బాబా మశీదులొనికి ప్రవేశించుటకు ఒప్పుకొనక, మశీదు ముందువున్న ఆవరణ లో కూర్చొని తనను దర్శించవచ్చునని చెప్పి రి. తనకు జరిగిన అమర్యాదకు అసంతుష్టుడై వెంటనే శిరిడీ వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయిం చుకొని బాబా సెలవు అడుగుటకు వచ్చాడు. కాని బాబా అతనితో ”ఈరోజున శిరిడీని నువ్వు విడువవలదు. రేపు బయలుదేరుము” అని సలహా ఇచ్చారు. కాని ఆగ్రహంతో వున్న ఆ ఐరోపా దేశస్థుడు బాబా సలహాను ఖాతరు చెయ్యక టాంగా నెక్కి శిరిడీ నుండి బయలు దేరాడు. సాహుల్‌విహార్‌ దాటిన వెంటనే ఒక సైకిల్‌ ఎదురు రావడం వలన టాంగాకు కట్టిన గుర్రములు బెదిరి వేగంగా అటూఇటూ పరిగె త్తడం ప్రారంభించాయి. టాంగా తలకిందుల య్యింది. ఆ ఐరోపా పెద్దమనిషి రోడ్డుపై కొంత దూరం ఈడ్వబడి తీవ్రంగా గాయాల పాల య్యాడు. ఆ గాయములను బాగుచేసుకోవడం కోసం ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది.
ఇటువంటి అనేక సంఘటనల వలన బాబా ఆజ్ఞను ధిక్కరించువారు అనేక విధ ములైన ప్రమాదములకు గురి అయ్యెదరని, బాబా ఆజ్ఞానుసారం పోవు వారు సురక్షితంగా వుంటారని రుజువయ్యింది. మనము కూడా బాబా ప్రబోధాలను వంట బట్టించుకొని అతి సురక్షితముగా జీవితంలో ప్రయాణం చేసెద ముకాక!
సర్వం శ్రీ సాయినాథ పాదారవిందార్పణమస్తు.

Advertisement

తాజా వార్తలు

Advertisement