Friday, April 26, 2024

ముఖ‌చిత్రం ట్రైల‌ర్ రిలీజ్.. హీరోగా ప‌రిచ‌యం అవుతోన్న వికాస్ వ‌శిష్ఠ‌

కంటెంట్ ఉండాల‌నేగానీ అది పెద్ద సినిమా..చిన్న సినిమా అని ఆలోచించ‌ట్లేదు జ‌నం. చిన్న బ‌డ్జెట్ తో వ‌చ్చిన ఎన్నో చిత్రాలు భారీ కాసుల వ‌ర్షాన్ని కురిపించిన సంఘ‌ట‌న‌లు ఈ మ‌ధ్య కాలంలో చోటు చేసుకున్నాయి. కాగా రీసెంట్ గా ముఖ‌చిత్రం అనే చిన్న మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.వికాస్ వశిష్ఠ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాలో, కథానాయికగా ప్రియ వడ్లమాని కనిపించనుంది. ఇతర ముఖ్యమైన పాత్రలను విష్వక్సేన్ .. చైతన్య రావు .. రవిశంకర్ పోషించారు. గంగాధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ మేర‌కు ఈ మూవీ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేదిలా ఉంది. అందరూ అనుకుంటున్నా కథ ఇది .. అసలు జరిగింది ఇది .. అంటూ కథలో అసలు పాయింటును చెబుతూ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement