Monday, May 6, 2024

Krunal Pandya | గుడ్ న్యూస్ చెప్పిన క్రునాల్..

భారత క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా శుభవార్త చెప్పాడు. తను మరోసారి తండ్రి అయ్యానని చెప్పాడు. ఆయన భార్య పంఖూరి శర్మ ఈ నెల 21న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కృనాల్ పాండ్యా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఆ చిన్నారికి వాయు అని పేరు పెట్టినట్లు తెలిపారు. చిన్నారి వాయు ఫొటోతో పాటు కుటుంబ సభ్యుల ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement