Friday, May 3, 2024

MBNR: కాంగ్రెస్ లో చేరిన బల్మూరు మండల బీఆర్ఎస్ నాయకులు

అచ్చంపేట, ఏప్రిల్ 26 (ప్రభ న్యూస్) : నాగర్ కర్నూల్ జిల్లాలోని బల్మూరు మండల బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయ‌కులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్ర‌వారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొండానాగుల గ్రామ మాజీ సింగల్ విండో చైర్మన్ చంద్రమోహన్ యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ రామస్వామి గౌడ్, సింగల్ విండో డైరెక్టర్ లాలు రెడ్డి, సింగల్ విండో మాజీ వైస్ చైర్మన్ బిచ్చన్న తదితరులు బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేసి నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి మల్లు రవి, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.


ఈకార్యక్రమంలో బల్మరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షులు మషాన్న, జిల్లా నాయకులు శ్రీపతి రావు, సుధాకర్ గౌడ్, చుక్క రెడ్డి, తిరుపతి రావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లికంటి శ్రీనివాస్, మహమూద్, మహాదేవపూర్ ఎంపీటీసీ ఆంజనేయులు, లక్షమయ్య గౌడ్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కిరణ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement