Tuesday, May 14, 2024

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే ‘ఆల’

దేవరకద్ర : దేవరకద్ర మండల పరిధిలోని పేరూరు గ్రామానికి లిఫ్టఏర్పాటు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వం రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మనసున్న మహారాజు అయ్యారని పేరూరు టిఆర్ ఎస్‌ నాయకులు అన్నారు. పేరూరు లిఫ్ట ఏర్పాటు కోసం ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు తీసుకుని వచ్చి నిధులు మంజూరు చేసినందుకు వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందంభంగా పేరూరు , వెంకంపల్లి గ్రామ నడిబొడ్డులో ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం భారీ బాణాసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆల కు చుట్టు పక్కల గ్రామాల టిఆర్ ఎస్‌ నేతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి లక్ష్మమ్మ, మాజీ ఎంపిటిసి కృష్ణయ్య టిఆంఎస్‌ నాయకులు నాగరాజు , యాదవ్‌ సాగం , రవి సాగం , శివసాగం ,కృష్ణ సాగం , రాజగోపాల్‌ రెడ్డి , ఖలీల్‌ , నాగన్న , బిజి రాములు , శంకర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement