Wednesday, May 8, 2024

విలేఖరుల సమావేశంలో డి.కె.అరుణ..

గద్వాల్ : జిల్లా కేంద్రంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆర్డిఎస్‌ను ఆయుధంగా చేసుకుని పదవి చేపట్టిన ముఖ్యమంత్రి నేడు ఎక్కడ అంటూ డికె అరుణ ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం తుమ్మిళ్ల తెరమీదకు తెచ్చి ప్రారంభించిన కేసిఆర్‌ నేటికి ఒకే పంపుకు దిక్కయిందన్నారు. రోజు ఇరిగేషన్‌లపై సమీక్షలు నిర్వహించే కేసిఆర్‌ పక్క రాష్ట్రం వాళ్లు అనుమతులు లేకుండా 400 టన్నుల స్టీల్‌ దింపి 4 టిఎంసిల నీటిని కొల్లగొట్టడానికే కుయుక్తులు పన్నుతుంటే దానిపై మాట్లాడకపోవడం వెనుక కుట్ర దిగి ఉందన్నారు. 15.9 టిఎంసిల నీరు తెలంగాణకు వాటాను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండటం శోచనీయమన్నారు. 100 గ్రామాల ఆర్డిఎస్‌ కింద పరివాహక ప్రాంతాల రైతులు ఉండగా 15.9 టిఎంసిల నీటిని రైతులు వాడుకోలేని దుస్థితిలో ఆర్డిఎస్‌ క్రింద ఉన్నారన్నారు. కాళేశ్వరం కింద నష్టపోయిన రైతులకు కోట్లు ఖర్చు చేస్తుంటే తుమ్మిళ్ల , పాలమూరు , రంగారెడ్డి ప్రాజెక్టుల కింద ఎందుకు కోట్లు కేటాయించడం లేదన్నారు. ఎమ్మెల్సి ఎన్నికల్లో కోట్లు కుమ్మరించి ఓట్లు దండుకున్న కేసిఆర్‌ 30 శాతం ఓట్లు కూడా సాధించలేకపోయారన్నారు. గట్టు ప్రాంతంలో ఆనాటి ప్రతిపాదనలే అమలు చేయడమే కాకుండా శంకుస్థాపన చేసిన దానికి మళ్లిd చేయడం వారి అభివృద్దికి నిదర్శనం తేటతెల్లం అవుతుందన్నారు. మొదట ఎక్కడైతే నిర్మాణం చేపట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తే అక్కడే మళ్లిd ప్రతిపాదనలు చేశారన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులు నేటికి పూర్తికాలేదని అందులో నెట్టెంపాడు ,రిజర్వాయర్లు , తుమ్మిళ్ల , ఆర్డిఎస్‌ క్రింద ఉండే బ్యాంకింగ్‌ పనులు డిస్ట్రిబ్యూటర్‌ లను ఏర్పాటు చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement