Monday, May 20, 2024

భర్తృహరి కార్యసాధన!

మానవుని కోరికలు అనంతాలు. వాటిని నెరవేర్చుకోవాలనే తపనతో మనిషి అనేక పనులు చేయాలని, జీవితంలో విజయం సాధించాలని ఆశ పడతాడు. మనిషి జీవితంలో విజయం సాధించటమనే ఆశయం లౌకిక పరంగానూ, ఆధ్యాత్మిక పరంగానూ కూడా అన్వయిస్తుంది.లౌకికంగా కాల ప్రవాహంలో పడి ఏదో పనిచేస్తూనో, చేయకుండానో కొట్టుకుపోవటం సర్వ సాధారణమైన వాస్తవం. అయితే దాని స్వరూపం మాత్రం చిత్రంగా ఉంటుంది. కొంతమందికి ఆశలు, కోరికలు వుంటాయి కానీ వాటి సాధనకు ప్రయత్నించరు. అసలు ఏ పనినీ మొదలెట్టరు. వారు నీచ మానవులు, సోమరులు.
కొందరు పనిచేయటం ఆరంభిస్తారు. కానీ ఏ చిన్న ఆటంకం కలిగినా మధ్యలోనే దాన్ని వదిలేసి చేతులు ముడుచుకు కూర్చుంటారు. వీరు మధ్యములు.
మరికొందరు ఎన్ని విఘ్నాలు ఎదురైనా సరే, అనుకున్నది సాధించే వరకూ ముందుకే నడుస్తారు. ధృతితో, ఉత్సాహంతో విజయాన్ని పొందుతారు. వీరే ధీరులు.
ఇదీ భర్తృహరి నీతి శతకంలో చేసిన కార్య సాధకుల విభజన.

Advertisement

తాజా వార్తలు

Advertisement