Wednesday, May 15, 2024

కనిపించని సంచార వైద్యం..

మహబూబ్‌నగర్‌ : గ్రామీణ ప్రాంత ప్రజలను ఆస్పత్రికి వెళ్లే ప్రయాసను తగ్గించేందుకు 104 సంచార వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రతి శుక్ర లేదా బుధవారాల్లో ఇవి ఆయా గ్రామాలకు చేరుకుంటాయి. ప్రత్యేక కూత ద్వార స్థానికులకు సంజ్ఞలు ఇస్తాయి. వైద్య సేవల వాహనం వచ్చినట్లు సమాచారం తెలుసుకుని ప్రజలు అక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అందులోని సిబ్బంది ఈ వాహనాన్ని అక్కడ ఒక కూడలిలో సేవలకు ఉపక్రమిస్తారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారితో పాటు రక్తపోటు , చక్కెర బాధితులకు వైద్య పరిక్షలు జరిపి మందులు పంపిణీ చేస్తారు. ఇందులో డ్రైవర్‌తో పాటు ఫార్మాసిస్టు , ల్యాబ్‌ టెక్నిషియన్‌ తప్పనిసరిగా ఉండాలి. ప్రతిరోజూ ఉదయం రెండు , సాయంత్రం రెండు గ్రామాల్లో ఈ వాహనం పర్యటించాలి. స్థానిక ఏఎన్‌ఎం , ఆశా కార్యకర్త అక్కడికి వచ్చి సేవల్లో తోడ్పాటు అందించాలి. వీరితో పాటు మండల పరిధిలో పనిచేసే వైద్యాధికారి పాలుపంచుకోవాలి. ఫార్మాసిస్టు తప్పా మిగతా వారు రావడం లేదు. ప్రస్తుతం జిల్లాలోని 440 గ్రామాలకుగాను ఐదు 104 వాహనాలే ఉన్నాయి. వీటితో రోగిని ఎక్కించుకుని పరీక్షించడానికి అవసరమైన పరికరాలు లేవు. అందులో సిబ్బంది కూర్చోవడానికి కుర్చీలు లేవు. పరీక్షలు నిర్వహించిన అనంతరం చేతులు శుభ్రం చేసుకోవడానికి పరికరాలు , నీటి వసతి లేకపోవడం ఇబ్బందిగా మారింది. వాహనంలో దీని కోసం ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేసినా పనిచేయడం లేదు. వీటి మరమ్మతు కోసం సిబ్బంది రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు సొంతంగా ఖర్చు చేసినా బిల్లులు మాత్రం రావడం లేదు. అలాగే మందుల కొరత తీవ్రంగా ఉంది. రెండు నెలల నుంచి తమకు వేతనాలు రావడం లేదని సిబ్బంది వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమకి ఆరోగ్య కేంద్రాలు 18 ఉండగా , 16 చోట్ల ఒక్కొక్కరు , రెండు చోట్ల మాత్రమే ఇద్దరేసి వైద్యులు ఉన్నారు. దీంతో 104 వాహనాల వెంట వెళ్లడానికి వారికి సాధ్యం కావడం లేదు. పిహెచ్‌సిల్లో ఓపితో పాటు ఇతర వైద్యసేవలు ఉన్నాయని చెబుతున్నారు. మరికొందరు విధులకే నామమాత్రంగా వస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ వాహనాల వెంట వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో రోగులకు ఫార్మసిస్టులు , నర్సింలు సిబ్బందే పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారు. వైద్యుల కోసం సమీప ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని సూచిస్తున్నారు. జిల్లాలో పనిచేస్తున్న 104 వాహనాలు షెడ్యూల్‌ ప్రకారం ఆయా గ్రామాలకు వెళ్తున్నాయి. కరోనా కారణంగా మెడికల్‌ ఆఫీసర్లు హాజరు కావడం లేదు. ఎక్కడా మార్పులు లేకుండా ఈ వాహనాలు తిరిగి గ్రామీణ ప్రజలకు వైద్యసేవలు అందిస్తాయి. 2020-21 104 ఆంబులెన్స్‌లు పర్యటించిన గ్రామాలు 258 , 1,62,063 మందికి పరీక్షలు నిర్వహించారు. 58,836 మందికి ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement