Sunday, June 20, 2021

తెలంగాణలో అక్కడ 9 తర్వాత సంపూర్ణ లాక్ డౌన్..

తెలంగాణ ప్రభుత్వం జూన్ 10 నుంచి లాక్ డౌన్ సడలింపులో భాగంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వకరకు సడలింపు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ నల్లగొండ జిల్లాలోని దండేపల్లి గ్రామంలో మాత్రం పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు ఆ గ్రామంలో విపరీతంగా పెరుగుతున్నండటంతో ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ పుష్పా సైదులు తెలిపారు. గ్రామస్తులకు నిత్యావసరాల నిమిత్తం దుకాణాలు మాత్రం ఉదయం 6 నుంచి 9 గంటలకు వరకు తెరుచుకుంటాయని సర్పంచ్ తెలిపారు.

గ్రామంలో జూన్ 20 వరకు ఎలాంటి ఫంక్షన్లు, వివాహాలకు అనుమతి ఉండదని సర్పంచ్ తెలిపారు. బెల్ట్ షాపులు బంద్ పాటిస్తాయన్నారు. ఎవరైనా గ్రామ పంచాయతీ ఏకగ్రీవ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. ఈ సమయంలో ఇతర ప్రాంతాల నుండి బంధువులను తమ ఇళ్లకు ఆహ్వానించవద్దని సర్పంచ్ గ్రామస్తులను కోరారు. కొవిడ్‌-19 పాజిటీవ్‌గా తేలిన ఇద్దరు వ్యక్తులు గ్రామంలో ఇష్టానుసారం తిరుగుతుంటే నల్లగొండ రూరల్ పోలీసులు వీరిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ప్రతి ఒక్కరు లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ .. కరోనా నిబంధనలు కూడా పాటించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News