Sunday, June 13, 2021

ముంబైలో కూలిన 4 అంతస్తుల భవనం.. 9 మంది సజీవ సమాధి

మహారాష్ట్రలోని ముంబైలో విషాదం చోటు చేసుకున్నది. మలాడ్‌ వెస్ట్‌ ప్రాంతంలోని న్యూకలెక్టర్‌ కాంపౌండ్‌లో బుధవారం రాత్రి ఓ నివాస భవనం కూలిపోయింది. ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో ఎనిమిది గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మహిళలు, పిల్లలు సహా మరో 15 మందిని రక్షించి ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమీపంలో ఉన్న రెండు భవనాలు సైతం సరైన స్థితిలో లేనందున వాటిలో ఉంటున్న వారిని సైతం ఖాళీ చేయించి కూల్చివేసినట్లు బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. ఘటనపై రాష్ట్ర మంత్రి అస్లాం షేక్‌ మాట్లాడుతూ భారీగా కురిసిన వర్షం కారణంగా భవనం కూలిపోయిందని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, గాయపడిన వారిని హాస్పిటల్‌లో చేర్పించారన్నారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా? లేదా? తెలుసుకునేందుకు శిథిలాల తొలగింపు పనులు జరుగుతున్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News