Monday, May 13, 2024

KHM: అభివృద్ధి కావాలా.. ? అభివృద్ధి నిరోధకులు కావాలా..? హరిప్రియ నాయక్

ఇల్లందు : అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కావాలో..? అభివృద్ధి నిరోధకులుగా ఉన్న కాంగ్రెస్ కావాలో..? ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియ నాయక్ అన్నారు. ఈరోజు సుదిమల్ల పంచాయితీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చిన కేసీఆర్ కు మనమంతా అండగా ఉండాలని, వచ్చే ఎన్నికల్లో ఆయనను దీవించాలని కోరారు. ఇల్లందు నియోజకవర్గంలో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉమాదేవి, మండల అధ్యక్ష కార్యదర్శులు శీలం రమేష్, రేణుక, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement