Thursday, May 2, 2024

KNL: కార్తీక సోమవారం.. శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు

కార్తీక మొదటి సోమవారం సందర్భంగా శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కొలువై ఉన్న శ్రీశైలంను అధిక సంఖ్యలో భక్తులు సందర్శించారు. వేకువజాము నుంచే పాతాళగంగలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించి తమ ఇష్టదైవంను దర్శించుకోవడం విశేషం. శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు గావించారు. భక్తుల సౌకర్యార్థం ఆర్జిత అభిషేకాలు నిలుపుదల చేయగా, స్వామివార్ల అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించారు.

ఇక క్యూకాంప్లెక్స్ లోని భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం అందజేశారు. ఈ రోజు సాయంత్రం పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వెల్లడించారు. అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహానంది, యాగంటి, కాల్వబుగ్గ ఇతర ముక్కంటి ఆలయాల్లో కూడా భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకోవడం విశేషం. యాగంటి, మహానందికి భారీగా భక్తులు తరలిరాగా.. అందుకు అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు గావించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement