Sunday, April 28, 2024

Kohli :ఇండియాకు స్వ‌ల్ప ఊర‌ట‌….ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ

టీం ఇండియా వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ ఓటమి అనంత‌రం స్వ‌ల్ప ఊర‌ట ల‌భించింది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి వరల్డ్ కప్ 2023లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డ్ దక్కింది. మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన విరాట్ ఏకంగా 90.31 సగటుతో 765 పరుగులు బాదాడు.

దీంతో 2003 వరల్డ్ కప్‌లో అత్యధికంగా 673 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. ఒకే ప్రపంచ కప్ ఎడిషన్‌లో కోహ్లీ కొట్టినన్ని పరుగులు ఇంతవరకు ఏ ఆటగాడు సాధించలేదు. కోహ్లీ 11 మ్యాచ్‌‌లు ఆడగా సగటు 95.62, స్ట్రైక్ రేట్ 90.31గా ఉంది. ఈ టోర్నీలో 3 సెంచరీలు ఉన్నాయి. లీగ్ దశలో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, సెమీఫైనల్లో న్యూజిలాండ్‌‌పై కోహ్లీ శతకాలు నమోదు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement