Tuesday, May 14, 2024

ఉసిల్ల దండ‌యాత్ర‌.. వాహ‌న‌దారులు జ‌ర భ‌ద్రం..!

తిమ్మాపూర్ : అసలే కాకతీయ కాలువ ప్రమాదాలకు అడ్డాగా గుర్తింపు పొందింది. గత సంవత్సరంలో కాకతీయ కాలువపై జిల్ కు చెందిన ఇద్దరు భార్యాభర్తలు కాలువ వద్ద డివైడర్ లేక కాకతీయ కాలువలో పడి మృతి చెందారు. ఈ కాలువలో మృతి చెందిన సంఘటనలు ఎక్కువే. అలాంటి కొన్ని సంఘటనలు మరవకముందే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ శివారులో కాకతీయ కాలువ వద్ద రాత్రి సమయంలో గత కొన్ని రోజులుగా మళ్ళీ ఉసిల్లు రాత్రి సమయంలో అధిక సంఖ్యలో గుంపులు గుంపులుగా చేరి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. సాయంత్రం ఏడు అయిందంటే వాహనదారులకు పురుగులతో భయపడకుంటూ నడుచుకుంటూ రోడ్డు దాటుతున్నారు. కాకతీయ కాలువ నిండుగా నీళ్లతో ప్రవ‌హిస్తూ ఉండగా ఇటు పురుగుల బెడదతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని వాహనా చోదకులు బయపడుతున్నారు. అటు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు ఇటు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వచ్చే వాహనదారులు కాకతీయ కెనాల్ వద్ద పురుగులతో సతమతమై తీవ్ర ఇబ్బందులు పడదుతున్నారు. రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోక ముందే చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement