Sunday, April 28, 2024

పెన్నా నది ఉగ్రరూపం

అనంతపురం జిల్లాలో పెన్నా ఉగ్రరూపంగా ప్రవహిస్తోంది. పేరూరు జలాశయం నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు. పీఏబీఆర్ జలాశయం నుంచి 25 కిందకు వదిలిపెట్టారు. పెన్నా పరివాహక ప్రాంత రైతులను, ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గడచిన 30 సంవత్సరాల్లో ఇంత పెద్ద వరద ఎప్పుడు రాలేదని ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. బీటీపీ నుంచి వేదవతి, హగరీ నదికి 65 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కర్ణాటకలోని వాణి విలాస్ జలాశయం పూర్తిగా నిండిపోవడంతో ఈ నీరు విడుదలైంది. 80 సంవత్సరాల చరిత్రలో మొదటి సారిగా ఇంతటి వరద వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. వేదవతి హగరి నది ద్వారా కర్ణాటకలోని బళ్లారి మీదుగా ప్రవహించి, తిరిగి తుంగభద్ర నదిలో ఈ నీరు కలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement