Wednesday, May 22, 2024

స్పౌజు కేటగిరి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

స్పౌజు కేటగిరి ఉపాధ్యాయులు భార్య భర్తలు వేర్వేరు జిల్లాలకు కేటాయించబడిన వారిని ఒకే జిల్లాకు కేటాయించాలని కోరుతూ ఛ‌లో ప్రగతి భవన్ కార్యాచరణకు వెళ్తున్న ఉపాధ్యాయులను బస్టాండ్ ఆవరణలో వెళ్లకుండా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన కార్యక్రమాన్ని అరెస్టులతో అడ్డుకోవడం రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్పౌజు కేటగిరీ ఉపాధ్యాయులను ఒకే జిల్లాలో ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించినా, అధికారులు మాత్రం 13 జిల్లాలకు ఇన్కమింగ్ బ్లాక్ చేయడం జరిగింది. వెంటనే బ్లాక్ చేసిన జిల్లాలను ఓపెన్ చేసి స్పౌజు కేటగిరి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ ఆర్ టి శ్రీనివాస్ రెడ్డి, ఇ మహ్మద్ సలీం, జక్కోజు వెంకటేశ్వర్లు, నజీర్, కిషోర్, అప్పిడి సత్యనారాయణ రెడ్డి, డి.సాయి రెడ్డి, శంకర్, ఎం.విజయ్ కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement