Saturday, May 18, 2024

Somu Veerraju: ఆత్మకూరు ఘటనలో దేశద్రోహులు

కర్నూలు జిల్లా ఆత్మకూరులో బీజేపీ నేత శ్రీకాంత్ రెడ్డిపై జరిగిన దాడిలో దేశద్రోహుల పాత్ర ఉందని పోలీసు వర్గాల నివేదిక ఆధారంగా స్పష్టమవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. ఈ విషయమై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను బీజేపీ నేతలు కలిశారు. ఆత్మకూరు ఘటనపై జోక్యం చేసుకోవాలని కోరారు. బీజేపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ డిఎస్పి పిలుపు మేరకు శ్రీకాంత్ రెడ్డి అక్కడికి వెళ్లారని అన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున మోహరించిన ఓ వర్గం వారు దాడికి పాల్పడి కారు ధ్వంసం చేశారన్నారు.

స్వయంగా పోలీసులపైనే రాళ్ల దాడి చేసి వారి వాహనాన్ని కూడా ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఏ విధమైన ఆయుధాలు లేకుండా నిరాయుధుడైన వెళ్లిన శ్రీకాంత్ రెడ్డిపై సెక్షన్ 307 ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్న కేరళలో రాడికల్ ముస్లిం outfit(RMO) సంస్థ సభ్యులు అన్నట్టు స్వయంగా జిల్లా ఎస్పీ నిర్ధారించినట్లు అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని తమ పార్టీ నేతలుపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలని సోమరాజు డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో ముఖ్యమంత్రి ద్రోహులకు మద్దతుగా ఉన్నారని భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement