Saturday, April 27, 2024

కార్మికులపై పనిభారం మోపొద్దు..

రామగిరి: సింగరేణి కార్మికులపై పనిభారం మోపవద్దని ఏఐటీయూసీ ఆర్జీ3 బ్రాంచి కార్యదర్శి జూపాక రాంచందర్‌ డిమాండ్‌ చేశారు. కరోనా రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి కుటుంబాలను సైతం లెక్క చేయకుండా ఉత్పత్తి కోసం శ్రమిస్తున్నారన్నారు. కార్మికుల సంఖ్య తగ్గడంతో పనిభారం పెరిగిందని, యాజమాన్యం పురాలోచన చేసి ప్లేడేలను పాత పద్ధతిలో మార్చాలని కోరారు. అలాగే కరోనా సమయంలో పని చేస్తున్న కార్మికులకు స్పెషల్‌ ఇన్సెంటివ్‌లు ఇప్పించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement