Friday, May 3, 2024

పావురంపై FIR నమోదు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా?

పావురాలు ప్రేమ సందేశాలను కాదు టెర్రరిస్టుల సందేశాలను దేశ సరిహద్దులు దాటి మోసుకొస్తున్నాయి. ఇటీవల ఇండియన్​ ఆర్మీకి పావురాలతో కొత్త చిక్కు వచ్చి పడింది. ఏదీ సాధారణ పావురమో, ఏదీ టెర్రరిస్టుల ట్రెయిన్డ్​ పావురమో తెలియడం లేదు. తాజాగా మరో టెర్రరిస్టు పావురం పంజాబ్​ సరిహద్దులో పోలీసులకు చిక్కింది. పంజాబ్​ రాష్ట్రంలో పాక్​ సరిహద్దులో రోరన్​వాలా చెక్​పోస్టు దగ్గర విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్​ భుజంపై ఓ పావురం అకస్మాత్తుగా వచ్చి వాలింది. దాన్ని పరిశీలిస్తే పావురం కాలికి గమ్​తో అంటించిన లెటర్​ ఉంది. అందులో ఓ అంకే రాసి ఉంది. వెంటనే అనుమానించిన కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

ఇది తప్పకుండా పాకిస్తాన్​లో ఉన్న టెర్రరిస్టుల చేసిన పనే అని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. పావురం కాలికి ఉన్న కాగితంలో టెర్రరిస్టులకు సంబంధించిన సీక్రెట్​ కోడ్​ ఏంటో డీ కోడ్​ చేసే పనిలో ఉన్నాయి భద్రతా దళాలు. చివరకు ఏప్రిల్​ 17న కహగర్​ పోలీస్​ స్టేషన్​లో పావురంపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు పోలీసులు. గతేడాది మే 20న కశ్మీర్​ సరిహద్దులో సీక్రెట్​ కోడ్​ చేరవేస్తున్న పావురాన్ని పట్టుకున్నారు పోలీసులు. పురాతన రోజుల నుంచి పావురాలను రహస్య సమాచారం పంపే సాధనాలుగా ఉపయోగించే వారు. ఫోన్‌ల ట్యాపింగ్​ పెరిగిపోవడంతో టెర్రరిస్టులు పాతకాలం పద్దతులను ఎంచుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement