Monday, April 29, 2024

KNR: ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాత‌ర్.. మానకొండూరు త‌హ‌సీల్దార్ కార్యాలయం రూటే సపరేట్

పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఈనెల 12 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందన్న ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు మహాశివరాత్రి, శుక్రవారం, రెండో శనివారం, ఆదివారం సెలవులను రద్దు చేసిన విషయం అందరికి తెలిసిందే. కానీ అందుకు విరుద్ధంగా మానకొండూరు త‌హ‌సీల్దార్ కార్యాలయం రూటే సపరేట్ అన్న చందంగా ఉంది.

రెండో శనివారం 11గంటలైనా తాళం వేసి ఉన్న గేటు దర్శనమిచ్చింది. భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు పలు గ్రామాల రైతులు కార్యాలయానికి వచ్చి నిరాశతో వెనుతిరుగుతున్నారు. మూడు రోజుల పాటు ధరణి సేవలు అందించాల్సిన త‌హ‌సీల్దార్ కార్యాలయంపై ఉన్నతాధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement