Sunday, April 28, 2024

Ind vs Eng, 5th Test : లంచ్ బ్రేక్… ఇంగ్లండ్ స్కోరు 103/5

ధర్మశాలలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ఆట కొనసాగుతోంది. అయితే ఇవాళ ఉదయం ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే భారత్ జట్టు 477 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు లంచ్ బ్రేక్ సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది.

ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే పరుగులేమీ చేయకుండానే డకౌట్ కాగా, బెన్ డకెట్ రెండు పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆతర్వాత ఒల్లీ పోప్ కూడా 19 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో జైస్వాల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అలాగే జానీ బెయిర్ స్టో 31 బంతుల్లో 39 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ కాగా, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండు పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. బెన్ స్టోక్స్ ఔట్ కాగానే లంచ్ బ్రేక్ తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement