Friday, May 3, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 01

చతుర్థాధ్యాయము
దివ్యజ్ఞానము
1
శ్రీభగవాన్‌ ఉవాచ
ఇమం వివస్వతే యోగం
ప్రోక్తవాన్‌ అహమవ్యయమ్‌ |
వివస్వాన్‌ మనవే ప్రాహ
మనురిక్ష్వాకవే బ్రవీత్‌

తాత్పర్యము : దేవ దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను : అవ్యయమైన ఈ యోగ శాస్త్రమును నేను వివస్వానునకు(సూర్యదేవునకు) ఉపదేశిచింతిని. వివస్వానుడు దానిని మానవులకు తండ్రియైన మనువుకు ఉపదేశించగా, మనువు దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించెను.

భాష్యమ : ఇచ్చట మనకు భగవద్గీత యొక్క చరిత్ర తెలిజేయబడుచున్నది. దీనిని ప్రాచీన కాలములోనే సూర్యలోకము మొదలుగా సర్వలోకములందలి రాజులకు భోదించిరి. ప్రతి రాజూ, తన ప్రజలను కామము నుండి రక్షించి మానవ జీవిత లక్ష్యమైన భగవత్సంభంధాన్ని పునరుద్ధరించుకునేటట్లు పరిపాలించాలి. అందువలన వారికి భగవద్గీత జ్ఞానము తెలియవలసి ఉన్నది. స్వయముగా భగవంతుడే దీనిని భోదించి యుండుటచే అది అపౌరుషేయము లేదా మానవాతీతము అయి ఉన్నది. కాబట్టి శ్రీకృష్ణుడి నుండీ కొనసాగుతూ వస్తున్న గురు పరంపరలోనే దీనిని పొందవచ్చును గానీ, స్వార్థపూరిత మనస్కుల నుండి నేర్వలేము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement