Saturday, December 7, 2024

TS: మరోసారి ఐసెట్‌ దరఖాస్తులకు గడువు పొడిగింపు..

హైదరాబాద్‌ : తెలంగాణలో మరోసారి ఐసెట్‌ దరఖాస్తులకు గడువు పొడిగించారు. మార్చి 5వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఏప్రిల్‌ 30వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ముగిసింది. అయితే ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం (2024-2025)లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును మే 7వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు టీఎస్‌ఐసెట్‌ కన్వీనర్‌, కాకతీయ యూనివర్సిటీ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ప్రొఫెసర్‌ ఎస్‌.నర్సింహాచారి తెలిపారు. ఆలస్య రుసుం లేకుండా మంగళవారం వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఐసెట్‌ కన్వీనర్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

వచ్చే నెల జూన్‌ 5, 6 తేదీల్లో జరిగే ఈ పరీక్షకు రూ. 250 ఆలస్య రుసుంతో మే 17 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో మే 27 వరకు దరశాస్తు చేసుకొనేందుకు అవకాశం అధికారులు కల్పించారు. మే 28న హాల్‌ టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తామని,జూన్‌ 28న ఫలితాలు వెల్లడించనున్నట్లు ఐసెట్‌ కన్వీనర్‌ అన్నారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు, పొరపాట్లు సరిదిద్దుకునేందుకు మే 17 నుంచి 20 వరకు అవకాశం ఉందని నర్సింహాచారి వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement