Thursday, May 9, 2024

KNR: కల్వల చెరువుకు గండి

కరీంనగర్ జిల్లా శంకరపట్న మండల పరిధిలోని కల్వల గ్రామంలోని చెరువుకు గండి పడింది. జోరుగా కురుస్తున్న వానలకు భారీగా వరద పోటెత్తడంతో కలవల చెరువుకు గండిపడింది. చెరువుకట్ట తెగే ప్రమాదం ఉందని ముందుగానే పసిగట్టిన గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు చెరువుకు తాత్కాలికంగా ఇసుక బస్తాలతో మరమ్మతులు చేశారు.

వరద నీరు రావడంతో మత్తడి పక్కన గల మట్టి కట్టకు గండిపడింది. చెరువు నుండి నీరు భారీగా గండి ద్వారా బయటికి ప్రవహిస్తోంది. చెరువు కింద గల పంట పొలాలు నాటు వేయడంతో పొలాలు నీట మునిగాయి. అధికారులు సమాచారం తెలుసుకొని హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement