Monday, May 20, 2024

TS | కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న శ్రీకాంతాచారి తల్లి..

మలిదశ తెలంగాణ పోరాటంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి… కాసోజు శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేశారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి ఆమె… గురువారం హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షీ, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు న్యాయం జరగలేదని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశానని శంకరమ్మ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మెజారిటీ లోక్‌స‌భ‌ స్థానాలు గెలవడం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

నల్గొండ జిల్లాకు చెందిన వందలాది మంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శంకరమ్మ కుటుంబం రాష్ట్రానికి చేసిన త్యాగం కాంగ్రెస్ పార్టీ మరవదని, ఆమెకు పార్టీలో అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. తమ పార్టీలో చేరడానికి ఉత్సాహంగా ఉన్న నేతలను చేర్చుకోవాలని ఏఐసీసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. హుజుర్ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement