Monday, May 13, 2024

దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి గంగుల

అంబేద్కర్ కన్న కలలు దేశంలో ఎక్కడా లేకున్నా తెలంగాణలో నెరవేరుతున్నాయని, దళితులు ఆర్ధికంగా, సామాజికంగా ఎదగడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర బీసీ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో దళిత బంధులో భాగంగా తాహెర్ కొండాపూర్ గ్రామానికి కేటాయించిన యూనిట్లను ఎంపీడీవో కార్యాలయంలో శనివారం లబ్ధిదారులకు మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
పల్లె, పట్టణ ప్రగతి ద్వారా మన పల్లెలను మన భావితరాలకు అందించడానికి తెచ్చింది ఈ కార్యక్రమన్నారు. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన విద్యుత్ సమస్యలన్నీ తీర్చేందుకు ఈరోజు ఎలక్ట్రిక్ డే అని కార్యక్రమం తీసుకోవడం జరిగిందన్నారు.సబ్ స్టేషన్ లేక విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు.. నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చాలా ఏళ్లుగా దళితులు ఆర్థికంగా, సామాజికంగా వెనక్కి నెట్టివేయ బడ్డారని.. వీరిని ముందుకు తెచ్చి ఆర్ధికంగా సొంత కాళ్లపై నిలబడాలని సీఎం కేసీఆర్ ఈ దళిత బంధు కార్యక్రమం చేపట్టారన్నారు. దళిత బంధు పథకం భావితరాలకు దోహదపడుతుందని.. ఇద్దరు ముగ్గురు కలిసి ఒక యూనిట్ తీసుకొని సమిష్టిగా అభివృద్ధి చెందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు డ్రైవర్లుగా ఉన్నవారు నేడు ఓనర్లు అయ్యారన్నారు. అతి త్వరలో గ్రౌండింగ్ అన్ని పూర్తి చేస్తామ‌ని, అందరికీ ఇవ్వడం జ‌రుగుతుందన్నారు. దళిత బంధు యూనిట్లను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement