Monday, May 20, 2024

సిటిజెన్స్‌కు కరోనా వ్యాక్సిన్..

ఓదెల: సిటిజన్స్‌కు కరోనా వ్యాక్సిన్‌ ఇస్తున్నట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్‌ చక్రధర్‌ తెలిపారు. స్థానిక ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ తీసుకొనే వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు ఆధార్‌ కార్డు పరిశీలనతో రిజిస్ట్రేషన్లు చేస్తూ వ్యాక్సిన్లు వేశారు. 45 ఏళ్ల నుండి 59 ఏళ్లలోపు ఉన్న వారికి జబ్బుల నిర్ధారణ అనంతరం వ్యాక్సిన్‌ ఇస్తామని, 60 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇస్తున్నట్లు- వివరించారు. ఏప్రిల్‌ 1 నుండి 40 ఏళ్ల నుండి పైబడిన వారందరికీ వ్యాక్సిన్లు ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు- ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శనివారం ఉదయం 12 గంటలలోపు 13 రిజిస్ట్రేషన్‌ కాగా ఎనిమిది మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు- తెలిపారు. సెలవు రోజు తప్ప ఆస్పత్రిలో ప్రతినిత్యం ఉదయం 10గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సిన్లు ఇస్తున్నట్లు- చెప్పారు. వ్యాక్సిన్‌ కొరకు వృద్ధులు సైతం ఆసుపత్రికి వచ్చి క్యూలో కూర్చున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement