Saturday, May 4, 2024

రంగస్థలం కాంబినేషన్ రిపీట్…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. అయితే దీంతో పాటు సుకుమార్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. నటన పరంగా కూడా రామ్ చరణ్ కు ఈ సినిమా ఎంతో మంచి పేరును తీసుకువచ్చింది. అయితే ఈ కాంబోలో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారట.

అందుకు సంబంధించిన విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అధినేత లో ఒకరైన నవీన్ ఎర్నేని తెలిపారు. 2022 లో చరణ్ సుకుమార్ ల కలయికలో సినిమా చేస్తామని ఆయన ప్రకటించారు. మరోవైపు సుకుమార్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్నాడు. తర్వాత అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ తో సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement