Saturday, April 27, 2024

బీజేపీ పక్కా రైతు వ్యతిరేఖ పార్టీ : మంత్రి కొప్పుల ఈశ్వర్

జగిత్యాల : ప్రకృతి ప్రకోపంతో పంట నష్ట పోయిన రైతులకు మేలు చేసేందుకు ఎకరానికి రూ.10 వేల నష్టపరిహారాన్ని సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తే, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌, రైతులకు పరిహారం ఏ మూలకు సరిపోదూ, పంట నష్టం వివరాలు కేంద్ర ప్రభుత్వంకు ఎందుకు నివేదించరు అంటూ వ్యాఖ్యలు చేయడం ఆయన అవగాహన రాహిత్యంకు నిదర్శమని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చందోళి గ్రామంలో మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ.. వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాలో ప్రకృతి వైపరిత్యం వల్ల వడగండ్ల వాన కురిసి పంటలు దెబ్బతినడంతో రైతులు ఆత్మస్థెర్యాన్ని కోల్పోయిన వేల సీఎం కేసీఆర్‌ స్వయంగా దెబ్బతిన పంటపొలలను, వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి, రైతుల్లో దైర్యాన్ని నింపారన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా స్వయంగా సీఎం కేసీఆర్‌ రైతులను ఓదార్చేందుకు వారి వ్యవసాయ క్షేత్రాలకు వచ్చారన్నారు. దెబ్బతిన్న వ్యవసాయ క్షేత్రాలను, కూరగాయల తోటలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌ ఎకరానికి పంట నష్టం కింద పదివేల రూపాయలను ప్రకటించారన్నారు. ఈ మేరకు అప్పటికప్పుడు రాష్ట్రంలో అకాల వర్షంతో దెబ్బతిన్న 2,22 లక్షల ఎకరాలకు పంటనష్ట పరిహారంను విడుదల చేస్తూ జీవో జారీ చేశారన్నారు. గతంలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న సమయంలో ఏ ప్రభుత్వాలు రైతులకు సాయం అందించిన దాఖలాలు లేవన్నారు. మొక్కజొన్న పంట నష్టపోతే ఎకరానికి మూడువేల రూపాయలు, వరి నష్టపోతే ఎకరాన ఐదువేల రూపాయల పరిహారం ఇస్తూ వచ్చారన్నారు. అది కూడా పంటరుణం తీసుకునే సమయంలో, లేదా మరో పంట వేసే సమయంలో ఇన్‌పుట్‌ సబ్సిడీగా అందజేస్తూ వస్తున్నారన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోను ఇదే తంతు కొనసాగుతుందని, గతంలో ఉమ్మడి రాష్ట్రంలోను కాంగ్రెస్, టీడీపీ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఇదే పద్దతిని అవలంభించరన్నారు. ఈ అసంబద్ద పద్దతిని కాదని, సీఎం కేసీఆర్‌ తొలిసారిగా రైతుల్లో ఆత్మస్థెర్యం నింపేందుకు ఎకరానికి పంటనష్టం పదివేల రూపాయలు నేరుగా ప్రకటించడంతో పాటు, నిధులు విడుదల చేయడం చాలా గొప్పవిషయం అన్నారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో రైతుల్లో సంతోషం వ్యక్తం ఆనందం వ్యక్తం అవుతుందన్నారు. పంటనష్ట పోయిన రైతులను సీఎం కేసీఆర్‌ కలిసిన సమయంలో పంటనష్టం తమకు ఇబ్బంది కలిగిస్తుందని, అయితే సీఎం కేసీఆర్‌ రైతుల మేలు కోసం తీసుకువచ్చిన పథకాల నేపథ్యంలో ఈ కాస్తా నష్టాన్ని తాము భరించేందుకు సిద్దంగా ఉన్నామని, రైతులు చెప్పారన్నారు. స్వయంగా తమను కలిసి తమలో ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు, ఎకరానికి పదివేల చొప్పున పంట నష్ట పరిహారం ప్రకటించడం పట్ల వారు తమ ధన్యవాదాలు తెలిపారన్నారు.
సీఎం కేసీఆర్‌ పంటనష్టాన్ని పరిశీలించడం, పరిహారం ప్రకటించడం, రైతులు సంతోషాన్ని వ్యక్తం చేయడాన్ని జీర్ణించుకోని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నష్టపరిహారం సరిపోదంటూ ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని, ఉచిత విద్యుత్‌ను సైతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్న విషయం మర్చిపోయిన బండి సంజయ్‌, ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి పంటసాయం సైతం రాదూ అంటూ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ ఏ రాష్ట్రంలోనైనా పంట నష్టపోయిన రైతులకు పరిహారం కింద ఎకరానికి పదివేలు ఇస్తుందా అని మంత్రి ఈశ్వర్‌ ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంపై సరిగా స్పందించడం లేదని, దాని పాలసీ సరిగా లేదని, పంటనష్టం వివరాలను ఇచ్చినా పట్టించుకోవడం లేదని, గతంలో ఇచ్చినా రూపాయి ఇవ్వలేదని, కేవలం కేంద్ర ప్రభుత్వం రాజకీయం మాత్రమే చేస్తుందని, పంటనష్టం వివరాలను కేంద్రంకు ఇవ్వడం దండగా, కేంద్ర వైఖరికి నిరసనగా ఈ సారి పంట నష్టం వివరాలను కేంద్రంకు ఇవ్వమని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారన్నారు. స్వరాష్ట్రం సాధించిన తదుపరి రెండు మార్లు ప్రకృతి వైపరిత్యం వల్ల అకాల వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్నాయని, రెండు సార్లు పంట నష్టం వివరాలను కేంద్ర ప్రభుత్వంకు అందజేసినా, ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. రెండు సార్లు పంటనష్టం వివరాలు అందజేసి, పలుమార్లు కేంద్ర ప్రభుత్వంకు, వ్యవసాయ, ఉద్యాన వన శాఖల కేంద్ర అధికారులకు విన్నవించినా, ఒక్కరూపాయి నష్టపరిహారాన్ని ఇవ్వలేదన్నారు. బిజెపి ప్రభుత్వం కేవలం అది అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే పంటనష్టపరిహారాలను అందజేస్తుందన్నారు. రెండుమార్లు పంటనష్టం వివరాలు ఇచ్చి, పలుమార్లు అడిగినా స్పందించకపోవడంతో, విసిగిపోయిన సీఎం కేసీఆర్‌ ఇక పంటనష్టం వివరాలను కేంద్రానికి ఇవ్వమన్నారన్నారు. ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం స్పందించే తీరు ఎలా ఉంటుందో అందరికి తెలిసిందేనన్నారు. బిజెపి ప్రభుత్వం మొదటి నుండి రైతు వ్యతిరేఖిగానే వ్యవహరిస్తుందన్నారు. రైతులను ముంచే విధంగా వ్యవసాయ రంగంలో మూడు నల్లచట్టాలను తెచ్చిన ఘనత బిజెపి ప్రభుత్వంకే దక్కుతుందన్నారు.

ఈ నల్లచట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ రైతులు ఏడాదికి పైగా దేశ రాజధానిలో దీక్షలు చేసినా, పట్టించుకోలేదన్నారు. దీక్షలు, ధర్నాలు చేస్తున్న రైతులపైకి వాహానాలను ఎక్కించి, వారిని చంపిన దుర్మార్గమైన చరిత్ర బిజెపి పార్టీదేనాన్నరు. అలాంటి బిజెపి ప్రభుత్వం రైతులకు ఏ విధంగాను సాయం చేస్తుందన్న నమ్మకం లేదన్నారు. రైతుల గోస, వారి కోపంలో బిజెపి పార్టీ, బండి సంజయ్‌ ఇద్దరు రానున్న రోజుల్లో కొట్టుకుపోతారన్నారు. దేశంలో వ్యవసాయం, రైతాంగం అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంలో నూతన పాలసీని రూపొందించే సత్తా, రైతులపై ప్రేమే, ఆర్తి కేవలం సీఎం కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్ పార్టీకి మాత్రమే ఉందని, త్వరలోనే దేశంలోనే రైతుల మేలు కోసం కొత్త వ్యవసాయ పాలసీ వస్తుందన్నారు..రైతు రాజ్యయ్యే రోజు దగ్గరలోనే ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement