Saturday, April 20, 2024

ఇంటిపై కూలిన చిన్న విమానం.. త‌ప్పిన ప్ర‌మాదం

ఓ ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన చిన్న విమానం కంట్రోల్ త‌ప్పి ఇంటిపైన కూలిపోయింది. ఝార్ఖండ్ లోని ధన్ బాద్ సిటీలో జరిగిన ఈ ప్రమాదంలో పైలట్ కు, అందులో ప్రయాణిస్తున్న బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. సిటీ టూర్ లో భాగంగా బర్వాడ్ద ఏర్ స్ట్రిప్ నుంచి గ్లైడర్ విమానం బయల్దేరింది. అరకిలోమీటర్ వెళ్లగానే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది, ఆపై కంట్రోల్ తప్పి ఓ ఇంటి పిల్లర్ ను ఢీకొట్టింది. దీంతో విమానం ముక్కలైంది.విమాన ప్రమాదం గురించి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఆకాశంలో ఎగురుతున్న విమానం ఒక్కసారిగా తమ ఇంటిపై కూలడంతో భయాందోళనలకు గురయ్యామని ఆ ఇంటి యజమాని నీలేశ్ కుమార్ చెప్పారు. అయితే, ఈ ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులు ఎవరికీ ఏమీ కాలేదని వివరించారు. ఈ ప్రమాదానికి కారణం సాంకేతిక సమస్యేనని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. విచారణ పూర్తయితే కానీ ప్రమాదానికి అసలు కారణమేంటనేది తెలియదని చెప్పారు.రన్ వే పై నుంచి గాల్లోకి లేచిన కాసేపటికే ఓ విమానం ప్రమాదానికి గురైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement