Saturday, April 27, 2024

బిజెపి ఆవిర్భావ వేడుకలు

సుల్తానాబాద్‌: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు సుల్తానాబాద్‌ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులు ఎల్లంకి రాజన్న ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీస అర్జున్‌ రావు హాజరయ్యారు. పార్టీ జెండా ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. బీజేపీని కార్యకర్తలంతా మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement